logo

‘నిధులు తగ్గించడం వేతనదారుల పొట్ట కొట్టడమే’

భాజపా ప్రభుత్వం ఉపాధి పథకానికి నిధులు తగ్గించడం వేతనదారుల పొట్టకొట్టడమేనని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధానకార్యదర్శి జి.సింహాచలం పేర్కొన్నారు. కలెక్టరేట్‌ వద్ద ఉపాధి వేతనదారులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు.

Published : 26 May 2023 05:55 IST

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న ఉపాధి హామీ వేతనదారులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: భాజపా ప్రభుత్వం ఉపాధి పథకానికి నిధులు తగ్గించడం వేతనదారుల పొట్టకొట్టడమేనని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధానకార్యదర్శి జి.సింహాచలం పేర్కొన్నారు. కలెక్టరేట్‌ వద్ద ఉపాధి వేతనదారులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏటా ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తోందన్నారు. గతేడాది రూ.89 వేల కోట్లు ఉండగా, ఈసారి రూ.60 వేల కోట్లకు కుదించినట్లు వివరించారు. గతంలో వేతనదారులు పనిచేసే చోట అనేక సౌకర్యాలు ఉండేవని, ఇప్పుడు అవేమి లేవన్నారు. వేసవి భత్యం కూడా ఇవ్వడం లేదన్నారు. పట్టణాల్లోనూ ఉపాధి పనులు కల్పించాలని డిమాండు చేశారు. పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు ఎస్‌.ప్రసాద్‌, జిల్లా నాయకులు జి.ఈశ్వరమ్మ, కె.ఎల్లయ్య, సీఐటీయూ నాయకులు టి.తిరుపతిరావు, కె.సూరయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని