logo

‘పాలకుల విధానాలతో రోడ్డెక్కాల్సిన దుస్థితి’

దేశంలో రాజకీయ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, పాలకుల విధానాల కారణంగా సమస్యల పరిష్కారానికి ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్‌.ఝాన్సీ విమర్శించారు.

Published : 30 May 2023 04:20 IST

ప్రసంగిస్తున్న రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: దేశంలో రాజకీయ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, పాలకుల విధానాల కారణంగా సమస్యల పరిష్కారానికి ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్‌.ఝాన్సీ విమర్శించారు. రైతు కూలీ సంఘం జిల్లా మహాసభలు నగరంలోని బాపూజీ కళామందిరంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మణిపూర్‌లో జరిగిన ఘర్షణల్లో 120 మంది చనిపోయారని, దేశంలో శాంతిభద్రతలు ఏవిధంగా ఉన్నాయో ఈ సంఘటన ద్వారా ప్రత్యక్షంగా అర్థమవుతోందన్నారు. ఏఐఎఫ్‌టీయూ జాతీయ ఉపాధ్యక్షుడు గేణేష్‌ పండా మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో వ్యవసాయ పరిశ్రమలను మూసేసి కార్మికుల కడుపులు కొడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు అలరించాయి. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా పి.పోలారావు, తాండ్ర అరుణలతో పాటు 11 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని