logo

చెరువు మట్టి అక్రమ తరలింపుపై విచారణ

ఫరీదుపేట పంచాయతీలోని రామసాగరం చెరువులో మట్టి అక్రమ తరలింపుపై రెవెన్యూ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు.

Published : 30 May 2023 04:20 IST

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: ఫరీదుపేట పంచాయతీలోని రామసాగరం చెరువులో మట్టి అక్రమ తరలింపుపై రెవెన్యూ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తూ అధికార పార్టీ నేతలు దోచుకోవడంపై గత నెల 29న ‘ఈనాడు’లో ‘కన్ను పడితే.. కొల్లగొట్టేస్తున్నారు..?’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందిస్తూ వారు విచారణను ప్రారంభించారు. ఆర్‌ఐ మధుప్రియ, వీఆర్వో జనక చక్రవర్తి, సర్వేయర్‌ లింగరాజు మాట్లాడుతూ మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించామని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు