logo

‘నాలుగేళ్లలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది’

గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రం పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ విమర్శించారు.

Updated : 30 May 2023 05:38 IST

మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రం పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ విమర్శించారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ బతుకులు దుర్భరంగా మారాయని, గడిచిన నాలుగేళ్లలో ఒక్కరికి కూడా ఇల్లు కట్టించి ఇవ్వలేకపోయారని విమర్శించారు.  రాహుల్‌గాంధీ చేపట్టిన పాదయాత్రకు వచ్చిన అనూహ్య స్పందనతో వచ్చే ఎన్నికల్లో భాజపాకు డిపాజిట్లు కూడా రావని చెప్పారు. దేశంలో సామాజిక న్యాయం కనిపించడం లేదని, కీలకమైన పార్లమెంటు ప్రారంభోత్సవంలో స్వామీజీలను భాగస్వాములను చేయడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో  డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి, డీసీసీ నాయకులు సనపల అన్నాజీరావు, రెల్ల సురేష్‌, బస్వా షణ్ముఖరావు, ఈశ్వరి, మల్లిబాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని