logo

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చాం

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి పేద పిల్లవాడు ప్రపంచస్థాయి జ్ఞానాన్ని అందుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్‌ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Published : 30 May 2023 04:38 IST

తిమడాంలో రైతుభరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు

జలుమూరు, న్యూస్‌టుడే: విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి పేద పిల్లవాడు ప్రపంచస్థాయి జ్ఞానాన్ని అందుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్‌ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. జలుమూరు మండలంలోని తిమడాంలో గ్రామ సచివాలయం, రైతు భరోసాకేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌, జగనన్న కాలనీలు, పాఠశాల భవనం, ఇంటింటికీ తాగునీరు తదితర పథకాలను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత తెదేపా ప్రభుత్వానికి, ప్రస్తుత వైకాపా ప్రభుత్వం మధ]్య వ్యత్యాసం గమనించాలన్నారు. పేదవాడి ఇబ్బందులను గుర్తించి అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్న ఏకైక ప్రభుత్వం వైకాపా అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ వంటి ముఖ్యమంత్రి గతంలో లేరని, భవిష్యత్తులో కూడా అలాంటి వారు రారన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం ఆశయమన్నారు. కార్యక్రమంలో సర్పంచి సత్యవతి, ఎంపీపీ గోపి, పోలాకి జడ్పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణచైతన్య, డీసీసీబీ ఛైర్మన్‌ రాజేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని