రైలెక్కాలన్నా అవస్థలే..!
టెక్కలి రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలంటే ఓ ప్రయాస. అక్కడినుంచి ప్రయాణం చేయాలంటే మరింత అవస్థ. రైలు కోసం వేచి చూడాలంటే కనీస మౌలిక సదుపాయాల్లేని దురావస్థ. వెరసి రైలు నిలయంలో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు.
టెక్కలి స్టేషన్‌పై ఎందుకీ చిన్నచూపు..!
నిలువ నీడకూ నోచుకోని వైనం
టెక్కలి రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలంటే ఓ ప్రయాస. అక్కడినుంచి ప్రయాణం చేయాలంటే మరింత అవస్థ. రైలు కోసం వేచి చూడాలంటే కనీస మౌలిక సదుపాయాల్లేని దురావస్థ. వెరసి రైలు నిలయంలో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు.
న్యూస్‌టుడే, టెక్కలి,టెక్కలి పట్టణం
సౌకర్యాల కల్పన జరిగేనా ?
రైల్వేస్టేషన్‌లో ప్రధానంగా ప్రయాణికులు వేచి ఉండేందుకు నిలువ నీడ లేదు. ప్లాట్‌ఫాం ఎత్తు తక్కువ కావడంతో రైలు ఎక్కేందుకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలకు ఇబ్బందులు తప్పలేదు. కనీసం తాగునీటి సౌకర్యం లేదు. అన్నింటికీ మించి ప్లాట్‌ఫాంపై విద్యుత్తు దీపాలు లేకపోవడంతో రాత్రివేళల్లో రాకపోకలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాలన్నీ పనికిరాని మొక్కలు, చెత్తతో నిండిపోవడంతో స్టేషన్ నుంచి రాకపోకలు సాగించేందుకు సరైన మార్గమే లేదు. ఇలా చెప్పుకొంటూపోతే ఇక్కడ ప్రతీదీ ఓ సమస్యే.
ఎదుగూ బొదుగూ లేదు
డివిజన్ కేంద్రం టెక్కలి వల్ల నౌపడ-గుణుపూర్ మార్గం ఏర్పాటైంది. నాటి పర్లాఖెముండి రాజులు తమ ఆడపడుచును టెక్కలి రాజులకు ఇచ్చి వివాహం చేయడం, ఆమె రాకపోకల కోసం నారోగేజ్ రైలు మార్గం ఏర్పాటు చేశారు. కాలక్రమంలో అది గుణుపూర్ వరకు పొడిగించడం, పలు పోరాటాల అనంతరం బ్రాడ్‌గేజ్‌గా అభివృద్ధి చేశారు. నౌపడ నుంచి గుణుపూర్ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలు పెరుగుతున్నాయి. ఈ మార్గంలో విద్యుద్దీకరణ పూర్తి చేశారు. టెక్కలి రైల్వేస్టేషన్ అభివృద్ధిని మాత్రం అటు రైల్వే యంత్రాంగం, ఇటు పాలకులు పక్కన పెట్టేశారు. ఈ మార్గంలో నడిచే ఏకైక ఎక్స్‌ప్రెస్ రైలు రాజ్యరాణి టెక్కలిలో ఆగకుండా వెళ్లిపోతోంది. దీనిపై ఎన్నిసార్లు వినతులిచ్చినా ఎలాంటి స్పందన లేకుండా పోయింది.
ప్రతిపాదనలు పంపించాం...
టెక్కలి రైల్వేస్టేషన్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటికే రైల్వే శాఖకు రైల్వేస్టేషన్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించాం. త్వరితగతిన నిధులు మంజూరు చేసేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తా.
కింజరాపు రామ్మోహన్‌నాయుడు,పార్లమెంట్ సభ్యుడు, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: ‘మీ అందరి మద్దతు చూసి గర్వపడుతున్నా’: ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి
-
Chandra babu Arrest: ప్రజల ఫోన్లలో వాట్సాప్ డేటా తనిఖీ చేయడం దుర్మార్గమైన చర్య: లోకేశ్
-
Ravi Kishan : దానిశ్ అలీ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. చర్యలు తీసుకోండి : రవికిషన్
-
Nagababu: చంద్రబాబు అరెస్టుపై జనసైనికులు ఆవేదనతో ఉన్నారు: నాగబాబు
-
Khalistani ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. 19మంది ఆస్తుల జప్తునకు NIA సిద్ధం!
-
Rahul Gandhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి..! తెలంగాణలో భాజపాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు