సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం
తెదేపా మొదటి విడత ఎన్నికల మేనిఫెస్టో చూసి వైకాపా నేతలు విలవిల్లాడిపోతున్నారని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్
మాట్లాడుతున్న రవికుమార్, చిత్రంలో ఇతర నేతలు
గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: తెదేపా మొదటి విడత ఎన్నికల మేనిఫెస్టో చూసి వైకాపా నేతలు విలవిల్లాడిపోతున్నారని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపద ఎలా తీసుకొస్తారని వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నారని, చంద్రబాబు సంపద సృష్టికర్త అనే విషయం వాళ్లకి తెలియదన్నారు. తాము సంపద సృష్టించి పేదలకు పంచుతామని చెప్పారు. తెదేపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకే ప్రస్తుతం పేర్లు మార్చి అమలు చేస్తున్నారన్నారు. వైకాపా వచ్చిన తర్వాత పేరు మార్పిడి పథకం కాకుండా కొత్తగా ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణం జరిగి ఉంటే ఇప్పుడు లక్ష కోట్ల సంపద వచ్చి ఉండేదని, చేతకాని ప్రభుత్వం అమరావతిని మట్టి దిబ్బలా వదిలేసిందన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో 500 మందికిపైగా తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదు జమ కాలేదని, దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళితే పట్టించుకోలేదని విమర్శించారు. 2014లో తెదేపా ప్రభుత్వం 134 పథకాలు అమలు చేస్తే వైకాపా అందులో 100 రద్దు చేసి కేవలం 34 పథకాలు ఇస్తోందన్నారు. తెదేపా నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, పార్టీ ఉపాధ్యక్షులు పీఎంజే బాబు, తోణంగి వెంకన్నయాదవ్, తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్, జంగమ సాధికార కమిటీ రాష్ట్ర డైరెక్టర్ విభూతి సూరిబాబు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandra babu Arrest: ప్రజల ఫోన్లలో వాట్సాప్ డేటా తనిఖీ చేయడం దుర్మార్గమైన చర్య: లోకేశ్
-
Ravi Kishan : దానిశ్ అలీ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. చర్యలు తీసుకోండి : రవికిషన్
-
Nagababu: చంద్రబాబు అరెస్టుపై జనసైనికులు ఆవేదనతో ఉన్నారు: నాగబాబు
-
Khalistani ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. 19మంది ఆస్తుల జప్తునకు NIA సిద్ధం!
-
Rahul Gandhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి..! తెలంగాణలో భాజపాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
Canada: నిజ్జర్ హత్యపై అమెరికా నుంచే కెనడాకు కీలక సమాచారం..!