ఇచ్ఛాపురంలో సినిమా చిత్రీకరణ
స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో గురువారం సినిమా చిత్రీకరణతో సందడి నెలకొంది. ఇచ్ఛాపురానికి చెందిన అనపాన లక్ష్మీనారాయణ బాలల అంశంతో రూపొందించనున్న సినిమా తొలి సన్నివేశాన్ని ఆలయంలో చిత్రీకరించారు.
స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో గురువారం సినిమా చిత్రీకరణతో సందడి నెలకొంది. ఇచ్ఛాపురానికి చెందిన అనపాన లక్ష్మీనారాయణ బాలల అంశంతో రూపొందించనున్న సినిమా తొలి సన్నివేశాన్ని ఆలయంలో చిత్రీకరించారు. దీనికి నర్తు నరేంద్ర యాదవ్ దర్శకత్వం వహించగా, పట్టణ ఎస్సై కె.గోవిందరావు క్లాప్ కొట్టారు. పుర కమిషనర్ నల్లి రమేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పురాధ్యక్షురాలు పిలక రాజలక్ష్మి, ఉపాధ్యక్షురాలు ఉలాల భారతిదివ్య జ్యోతి వెలిగించి పూజలు చేశారు. అనంతరం చిత్రకథను దర్శకుడు లక్ష్మీనారాయణకు అందించి శుభాకాంక్షలు తెలిపారు. చిత్రం పేరు ‘ఈ సినిమా పేరేంటి’ అని జ్ఞానభారతి విద్యాలయ సీఈవో జోహర్‌ఖాన్ ప్రకటించారు. కౌన్సిలర్లు బచ్చు జగన్, పి.మధుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kishan Reddy: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర: కిషన్రెడ్డి
-
iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
-
China: చైనాలో జనాభా సంఖ్య కంటే ఖాళీ ఇళ్లే ఎక్కువ..!
-
Visakhapatnam: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్లో ఏడు రైళ్ల నిలిపివేత
-
Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’
-
Mann ki Baat: ప్రపంచ వాణిజ్యానికి అది ఆధారంగా నిలుస్తుంది: ప్రధాని మోదీ