రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగావకాశాలు
తెదేపా ఇటీవల మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టోను యువత నమ్మే స్థితిలో లేరని వైకాపా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎం.వి.స్వరూప్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని వైకాపా జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాట్లాడుతున్న వైకాపా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు స్వరూప్, చిత్రంలో పార్టీ నాయకులు
శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: తెదేపా ఇటీవల మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టోను యువత నమ్మే స్థితిలో లేరని వైకాపా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎం.వి.స్వరూప్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని వైకాపా జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక కేవలం 14 వేల మందికే ఉద్యోగాలు ఇవ్వటంతో పాటు ఆరు నెలల పాటు 2 లక్షల మందికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.50 లక్షల మందికి ఉద్యోగాలిచ్చిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబునాయుడు మెప్పు కోసం మహానాడులో ఎంపీ రామ్మోహన్‌నాయుడు ముఖ్యమంత్రిపై ఇష్టానుసారం మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకుంటున్నారన్నారు. నిరుద్యోగ యువతకు జరిగిన మేలుపై జిల్లాలో ఎంపీ సూచించిన ఏ ప్రాంతంలోనైనా చర్చకు తాము సిద్ధమని సవాలు విసిరారు. సమావేశంలో వైకాపా యువజన విభాగం నాయకులు బి.సంతోష్, జి.మహేష్, ఎన్.రామరాజు, ఎస్.రామారావు, కె.తేజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kishan Reddy: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర: కిషన్రెడ్డి
-
iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
-
China: చైనాలో జనాభా సంఖ్య కంటే ఖాళీ ఇళ్లే ఎక్కువ..!
-
Visakhapatnam: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్లో ఏడు రైళ్ల నిలిపివేత
-
Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’
-
Mann ki Baat: ప్రపంచ వాణిజ్యానికి అది ఆధారంగా నిలుస్తుంది: ప్రధాని మోదీ