logo

సనాతన ధర్మం ఆదర్శనీయం

హైందవ ధర్మపరిరక్షణే ధ్యేయంగా...సనాతన ధర్మప్రచారమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కృష్ణాజిల్లా గన్నవరంలోని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామి పిలుపునిచ్చారు.

Published : 02 Jun 2023 05:57 IST

కాళభైరవాలయంలో కమలానంద భారతి స్వామి అభిభాషణం

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: హైందవ ధర్మపరిరక్షణే ధ్యేయంగా...సనాతన ధర్మప్రచారమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కృష్ణాజిల్లా గన్నవరంలోని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం బలగ నాగావళి నదీతీరంలోని కాళభైరవాలయంలో బాలత్రిపుర సుందరీ కాళభైరవ పీఠం, విశ్వహిందూ పరిషత్‌ సంయుక్త నిర్వహణలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పురాణ ఇతిహాసాలు, సనాతన హైందవ ధర్మం విశిష్టతలను వివరించారు. ప్రపంచదేశాలకు భారతీయ సనాతన ధర్మం ఆదర్శనీయమని చెప్పారు. కాళభైరవ పీఠం వ్యవస్థాపకులు, దేవీఉపాసకులు పొగిరి గణేష్‌, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని