logo

నాటు బండి కింద పడి యువకుడి మృతి

ఇసుక అక్రమంగా తరలిస్తున్న నాటుబండి కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.

Published : 03 Jun 2023 05:07 IST

సదాశివుని రాజేష్‌

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఇసుక అక్రమంగా తరలిస్తున్న నాటుబండి కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం నగరంలోని ఖాజీపేటకు చెందిన సదాశివుని రాజేష్‌(38)స్నేహితులతో కలిసి నాటు బండిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒడిశాకు చెందిన బలరాంను ఆపారు. బలరాంకు రాజేష్‌ స్నేహితులతో వాగ్వాదం జరిగింది. నాటు బండిని ఆపాలని చెప్పినప్పటికీ బలరాం వినకుండా బండిని ముందుకు నడిపాడు. ఈ క్రమంలో రాజేష్‌ బండి టైరు కింద పడిపోయాడు. అనంతరం బండి అతనిపై నుంచి వెళ్లింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజేష్‌ను సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా రాజేష్‌ చనిపోయాడు. ఈయనకు తల్లిదండ్రులు, భార్య ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ. విజయ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని