logo

‘సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే’

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నాయకులు స్పష్టం చేశారు.

Published : 03 Jun 2023 05:07 IST

నిరహార దీక్ష చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నాయకులు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నాయకులు స్పష్టం చేశారు. పలాసలో శుక్రవారం తహసీల్దారు కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. 12వ వేతన సవరణ చేయాలని, ఒకటో తేదీ నాటికి జీతాలు చెల్లించాలని కోరారు. సంఘం జిల్లా కార్యదర్శి అలికాన రాజేశ్వరి, పలాస శాఖ అధ్యక్షుడు ఎన్‌.లక్ష్మీనారాయణ, అనురాధ, జీవన్‌దాస్‌, ప్రసాద్‌, శ్రీనివాస పండా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని