logo

అందరి భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్‌ రహిత సమాజం

అందరి భాగస్వామ్యం, సహకారంతోనే భావితరాలకు ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని అందించగలమని, ఆ దిశగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా అటవీ శాఖాధికారిణి నిషాకుమారి పిలుపునిచ్చారు.

Published : 06 Jun 2023 04:46 IST

ర్యాలీని ప్రారంభిస్తున్న జిల్లా అటవీశాఖాధికారిణి నిషాకుమారి, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు

గుజరాతీపేట(శ్రీకాకుళం), బలగ, న్యూస్‌టుడే: అందరి భాగస్వామ్యం, సహకారంతోనే భావితరాలకు ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని అందించగలమని, ఆ దిశగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా అటవీ శాఖాధికారిణి నిషాకుమారి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారం కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎస్‌.శంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఏడురోడ్ల కూడలి నుంచి కోడిరామ్మూర్తి మైదానం వరకు ర్యాలీ చేశారు. ప్రదర్శనను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం డీఎఫ్‌వో మాట్లాడారు. మొక్కలు నాటాలని, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెడ్‌క్యాప్‌ జిల్లా మేనేజర్‌ సుబ్రహ్మణ్యం, మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌, జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు, ఎన్‌వైకే యూత్‌ కోఆర్డినేటర్‌ ఉజ్వల్‌, సెట్‌శ్రీ సీఈవో ప్రసాదరావు, డీఎస్‌డీవో శ్రీధర్‌, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు డాక్టర్‌ మంత్రి వెంకటస్వామి, శ్రీనివాస్‌, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని