logo

ఇంత నిర్లక్ష్యమా..? : ఎంపీ

ఇచ్ఛాపురం వంతెన నిర్వహణపై, కూలిన వంతెన స్థానంలో తాత్కాలిక పనులపైన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చూపారని, వంతెన కూలిపోయిన నెల తరువాత శిథిలాలు తొలగిస్తుంటే, ఎప్పటికి పనులు పూర్తవుతాయని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌   నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 06 Jun 2023 06:06 IST

పనుల తీరును ఎంపీకి వివరిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం వంతెన నిర్వహణపై, కూలిన వంతెన స్థానంలో తాత్కాలిక పనులపైన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చూపారని, వంతెన కూలిపోయిన నెల తరువాత శిథిలాలు తొలగిస్తుంటే, ఎప్పటికి పనులు పూర్తవుతాయని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌   నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇచ్ఛాపురంలో పర్యటించేందుకు వచ్చిన ఆయన ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, పార్టీ నాయకులతో కలసి కూలిన వంతెన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ దుర్ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడం అదృష్టమన్నారు. తాత్కాలిక వంతెన పనులకు రూ.40 లక్షలు ఎలా సరిపోతాయో అధికారులకే తెలియాలన్నారు. కూలిన వారానికి నిధులు కేటాయించారు. మూడు  వారాల తర్వాత పనులకు శ్రీకారం చుట్టారని, ఇంత నిర్లక్ష్యం సరికాదని పేర్కొన్నారు. తాత్కాలిక వంతెన పనులను యుద్ధప్రాతిపదికన మూడు వారాల్లో పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.  కొత్త వంతెన ప్రతిపాదనలు కూడా సత్వరం పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, పార్టీ రాష్ట్ర బీసీ సాధికారిత సమితి కన్వీనర్‌ శంకర్‌రెడ్డి,  తెలుగు మహిళ జిల్లా కార్యదర్శి  లీలారాణి, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు