logo

‘బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలి’

రెజ్లర్లను లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, రెజ్లర్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను పదవి నుంచి తప్పించి తక్షణం అరెస్టు చేయాలని భారత్‌ బచావో జిల్లా కమిటీ కో-కన్వీనర్‌ కె.వి.జగన్నాథరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

Published : 06 Jun 2023 04:46 IST

నినాదాలు చేస్తున్న భారత్‌ బచావో జిల్లా కమిటీ ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: రెజ్లర్లను లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, రెజ్లర్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను పదవి నుంచి తప్పించి తక్షణం అరెస్టు చేయాలని భారత్‌ బచావో జిల్లా కమిటీ కో-కన్వీనర్‌ కె.వి.జగన్నాథరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. భారత్‌ బచావో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జగన్నాథరావు మాట్లాడుతూ రెజ్లర్లు దిల్లీలో రెండు నెలలుగా ధర్నా చేస్తున్నా ఆయనపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు. వారి పోరాటానికి అంతా సంఘీభావం తెలపాలని కోరారు. అనంతరం బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు కె.ధర్మారావు, డి.గణేష్‌, బి.ప్రభాకర్‌, ఎం.కృష్ణయ్య, భారత్‌ బచావో జిల్లా కమిటీ నాయకులు రంజిత్‌, జిలానీ, అబ్దుల్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని