logo

డాక్టర్‌ రెడ్డీస్‌ పరిశ్రమకు పురస్కారం

ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) అందించే పర్యావరణ పురస్కారం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ను వరించింది.

Published : 06 Jun 2023 04:46 IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్న పరిశ్రమ ప్రతినిధులు

రణస్థలం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) అందించే పర్యావరణ పురస్కారం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ను వరించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధులకు అవార్డును పర్యావరణ, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రదానం చేశారు. పైడిభీమవరంలోని సీటీవో-6 యూనిట్‌కు పురస్కారం లభించిందని డాక్టర్‌ రెడ్డీస్‌ పరిశ్రమ హెడ్‌ ధర్మేష్‌ పంచల్‌, హెచ్‌ఆర్‌ హెడ్‌ కేవీఎస్‌ఎన్‌ రాజు, సేఫ్టీ- పర్యావరణ హెడ్‌ శ్రీధర్‌ తెలిపారు. తమ సంస్థలో అనుసరిస్తున్న సుస్థిర పద్ధతులతో పాటు జీరో డిశ్ఛార్జ్‌ విధానం కారణంగా గుర్తింపు    దక్కిందని వారు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని