logo

వేబిల్లుల వివాదం.. అడిగితే దౌర్జన్యం

వైకాపా ప్రభుత్వం మైనింగ్‌ నిర్వహణలో తీసుకొచ్చిన కొత్త విధానంలో భాగంగా జిల్లాలో విశ్వసముద్ర సంస్థ అవలంభిస్తున్న ధోరణిని నిరసిస్తూ పొందూరులోని క్రషర్లు, క్వారీల నిర్వాహకులు మంగళవారం ఆందోళనకు దిగారు.

Published : 07 Jun 2023 06:06 IST

నరసాపురం వద్ద రోడ్డుపై బైఠాయించిన క్రషర్‌, క్వారీ యాజమానులు

పొందూరు, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం మైనింగ్‌ నిర్వహణలో తీసుకొచ్చిన కొత్త విధానంలో భాగంగా జిల్లాలో విశ్వసముద్ర సంస్థ అవలంభిస్తున్న ధోరణిని నిరసిస్తూ పొందూరులోని క్రషర్లు, క్వారీల నిర్వాహకులు మంగళవారం ఆందోళనకు దిగారు. నరసాపురం వద్ద రాయిని తరలిస్తున్న వాహనాలను సంస్థ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొని దౌర్జన్యానికి పాల్పడ్డారని, వాటిని విడిచిపెట్టాలని కోరినా పట్టించుకోకపోవడంతో క్రషర్ల యాజమానులు అక్కడికి చేరుకొని రోడ్డుపై బైఠాయించి రెండు గంటలు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లరాయి, గ్రానైట్‌, మట్టి, గ్రావెల్‌ క్వారీలకు సీనరేజీ వసూళ్ల బాధ్యతను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో విశ్వసముద్ర సంస్థకు ప్రభుత్వం రూ.12.64  కోట్లకు అప్పగించిందన్నారు. ఈ సంస్థ మధ్యవర్తులను నియమించి వే బిల్లులను బ్లాక్‌ చేసి అధిక మొత్తాలకు అమ్ముతున్నారని ఆరోపించారు. గతంలో ప్రభుత్వానికి యూనిట్‌కు రూ.633 చెల్లించేవారమని, ఇప్పుడు ఈ సంస్థ యూనిట్‌ రూ.1200కు విక్రయిస్తోందన్నారు. సంస్థ కార్యాలయం టెక్కలిలో ఉన్నందున వే     బిల్లులకు అక్కడికి వెళ్లాల్సి వస్తోందని, ఆ బిల్లులు చూపితే అధికారులు భారీగా జరిమానాలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రెండు గంటలు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఏఎస్‌ఐ రామచంద్రరరావు వచ్చి ఇరువర్గాలతో మాట్లాడి తాత్కాలికంగా వివాదాన్ని పరిష్కరించడంతో పరిస్థితి సద్దుమణిగింది.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు