logo

జిల్లాలో ప్రీ ఆడిట్‌ విధానం అమలు

ప్రీఆడిట్‌ విధానంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగాన్ని నివారించొచ్చని రాష్ట్ర ఆడిట్‌ శాఖ డైరెక్టర్‌ ఆర్‌.హరిప్రకాశ్‌రెడ్డి అన్నారు.

Updated : 07 Jun 2023 06:32 IST

మాట్లాడుతున్న రాష్ట్ర డైరెక్టర్‌ హరిప్రకాశ్‌ రెడ్డి

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: ప్రీఆడిట్‌ విధానంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగాన్ని నివారించొచ్చని రాష్ట్ర ఆడిట్‌ శాఖ డైరెక్టర్‌ ఆర్‌.హరిప్రకాశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆమదాలవలస మున్సిపల్‌ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది   జిల్లాలో పురపాలక, ఆర్థిక శాఖ అధికారుల సమన్వయంతో ప్రీఆడిట్‌ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పోస్టుఆడిట్‌ విధానంలో ఇబ్బందులు ఉన్నాయని, వీటిని అధిగమించేందుకు ముందస్తు పరిశీలన ఉపయోగపడుతుందన్నారు.  సీఎఫ్‌ఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌లో ఈ విధానాన్ని పురపాలికల్లో అమలుచేస్తున్నట్లు చెప్పారు. త్వరలో  జిల్లా ఆడిట్‌, పుర అధికారులకు శిక్షణ   కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విశాఖపట్నం ఆర్డీడీ సీతారామారావు, ఏడీ రమణ, ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస పురపాలక కమిషనర్లు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు