logo

ప్రశాంతంగా పీజీసెట్‌

పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీ పీజీసెట్‌-2023 పరీక్షలు జిల్లాలోని రెండు కేంద్రాల్లో మంగళవారం ప్రశాంతంగా జరిగాయి.

Published : 07 Jun 2023 06:08 IST

శివాని ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రంలోకి వెళ్లే విద్యార్థులను తనిఖీ చేసి పంపిస్తున్న సిబ్బంది

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీ పీజీసెట్‌-2023 పరీక్షలు జిల్లాలోని రెండు కేంద్రాల్లో మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఎచ్చెర్ల మండలంలోని శ్రీ శివాని ఇంజినీరింగ్‌ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రాల్లో తొలిరోజు మొదటి షిఫ్టులో ఆంగ్లం సబ్జెక్టుకు 68 మంది విద్యార్థులకు గాను 53 మంది హాజరయ్యారు. రెండో షిఫ్టులో బోటనీ, మ్యాథమేటికల్‌ సైన్సెస్‌ సబ్జెక్టులకు సంబంధించి 226 మందికి గాను 197 మంది పరీక్ష రాశారు. మూడో షిఫ్టులో హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌సైన్సెస్‌ సబ్జెక్టుకు 80 మందికి 72 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 10 వరకు పీజీ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని