‘ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వం పడిపోతుంది’
ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వం పడిపోతుందని ఏపీజీఈఏ జిల్లా కార్యదర్శి ఎ.రాజేశ్వరి అన్నారు. మంగళవారం ఆమదాలవలసలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు
తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్షా శిబిరంలో నినాదాలు చేస్తున్న ఏపీజీఈఏ జిల్లా కార్యదర్శి రాజేశ్వరి, నాయకులు
ఆమదాలవలస గ్రామీణం,న్యూస్‌టుడే: ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వం పడిపోతుందని ఏపీజీఈఏ జిల్లా కార్యదర్శి ఎ.రాజేశ్వరి అన్నారు. మంగళవారం ఆమదాలవలసలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నేడు విస్మరించారని నిరసన తెలిపారు. పాదయాత్రలో సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని కూడా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఐక్యపోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈనెల 22 నుంచి అక్టోబరు 31 వరకూ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక సమ్మెకు దిగాల్సి వస్తుందన్నారు. తాలూకా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి.సురేష్, కార్యదర్శి బగాది నాగరాజు, కోశాధికారి హరీష్, సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూన వెంకట సత్యనారాయణ, ఉద్యోగుల సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.