నిలిచిన రైలు.. రాకపోకలకు ఇక్కట్లు
పలాస రైలు నిలయం సమీపంలోని కాశీబుగ్గ లెవల్ క్రాసింగ్ గేటుతో వాహనచోదకులు, పాదచారులకు ఇక్కట్లు తప్పడం లేదు. మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి పలాస వస్తున్న గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో గంటపాటు గేటు వద్ద ఆగిపోవటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి
పలాస లెవల్ క్రాసింగ్ గేటు వద్ద నిలిచిపోయిన గూడ్స్ రైలు
పలాస రైలు నిలయం సమీపంలోని కాశీబుగ్గ లెవల్ క్రాసింగ్ గేటుతో వాహనచోదకులు, పాదచారులకు ఇక్కట్లు తప్పడం లేదు. మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి పలాస వస్తున్న గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో గంటపాటు గేటు వద్ద ఆగిపోవటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ద్విచక్ర వాహనదారులంతా నర్సిపురం, తాళభద్ర రైల్వే గేటు మీదుగా కాశీబుగ్గ వెళ్లారు. పెద్ద వాహనాలు అక్కడే ఉండిపోయాయి. దీంతో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. రెండు, మూడు రైళ్లకు సిబ్బంది ఒకేసారి గేటు వేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
న్యూస్‌టుడే, పలాస
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే.. ఈ రికార్డులు నమోదవుతాయా?
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
NTR: ‘ఏఐ’ మాయ.. ఎన్టీఆర్‌ని తలపించేలా.. ఫొటో వైరల్