logo

లావేరు పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

లావేరు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బి.శ్రీనివాసరావును సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌  ఉత్తర్వులు జారీ చేశారని ఇన్‌ఛార్జి ఎంపీడీవో  విశ్వేశ్వరరావు మంగళవారం తెలిపారు.

Published : 07 Jun 2023 06:28 IST

లావేరు, న్యూస్‌టుడే: లావేరు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బి.శ్రీనివాసరావును సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌  ఉత్తర్వులు జారీ చేశారని ఇన్‌ఛార్జి ఎంపీడీవో  విశ్వేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రేగిడి ఆమదాలవలస మండలం ఉన్నపుడు అంబాడ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు 2018-21 కాలంలో 14, 15వ ఆర్థిక సంఘాల నిధుల్లో రూ.25 లక్షల మేర దుర్వినియోగానికి పాల్పడినట్లు గత నెల ఆ పంచాయతీ సర్పంచి చుక్కా వెంకటనాయుడు విజయనగరం జిల్లా కలెక్టర్‌, డీపీవో, జడ్పీ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారణ నిర్వహించి కలెక్టరుకు ఓ నివేదిక పంపించారు. దీని ఆధారంగా పంచాయతీ కార్యదర్శిని ఆయన సస్పెండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు