logo

Ram Mohan Naidu: యువత కోసం ‘ఎర్రన్న విద్యా సంకల్పం’: ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

శ్రీకాకుళం జిల్లాలోని యువత కోసం ‘ ఎర్రన్న విద్యాసంకల్పం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు.

Published : 10 Jun 2023 17:46 IST

శ్రీకాకుళం: పేదల కోసం పెట్టిన ‘అన్నా క్యాంటీన్లను’ సీఎం జగన్‌ మూసేశారని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలోని యువత కోసం ‘ ఎర్రన్న విద్యాసంకల్పం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. పోటీ పరీక్షల కోసం అభ్యర్థులకు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. పేదవాడినని చెప్పుకొనే జగన్‌ దేశంలోనే అత్యధిక ధనిక సీఎం అని రామ్మోహన్‌ అన్నారు. పేదవాడిని ధనికుడిగా చేసేలా చంద్రబాబు మేనిఫెస్టో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌కు చంద్రబాబే గ్యారెంటీ అని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలిలో తెదేపా నూతన కార్యాలయాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు.. జిల్లాలో గ్రూప్-1, గ్రూప్-2, సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు తయారయ్యే నిరుద్యోగ యువత కోసం ఎర్రన్న విద్యా సంకల్పం అనే ఉచిత పుస్తక వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉచిత పుస్తక వితరణతో పాటు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ శిక్షణ కార్యక్రమం అందిస్తామన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఈనెల 20వ తేదీలోపు అర్హులైన వారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మండలానికి స్కిల్ డెవలప్‌మెంట్‌ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అందించేందుకు తోడ్పడుతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని