logo

కదం తొక్కుతూ.. కలిసి సాగుతూ..!

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ శ్రేణులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Published : 24 Sep 2023 04:03 IST

శ్రీకాకుళంలో తెదేపా ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో..

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ శ్రేణులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా శనివారం తెదేపా నాయకులు, కార్యకర్తలు అధినేత ఆరోగ్యం బాగుండాలని పలు ఆలయాల్లో పూజలు చేశారు.

   ఎచ్చెర్ల: దీక్షలో పాల్గొన్న రామ్‌మల్లిక్‌నాయుడికి న్యాయవాదుల సంఘీభావం  

శ్రీకాకుళం నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయం వద్ద ఆ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.వి.రమణమాదిగ ఆధ్వర్యంలో దీక్ష జరిగింది. శిబిరానికి హాజరైనవారికి మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పూలమాలలు వేశారు. అంతకుముందు నగరంలోని డీసీసీబీ కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో చంద్రబాబు విడుదల కోరుతూ పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌, ఇతర నాయకులు పూజలు చేశారు. 108 కొబ్బరికాయలు కొట్టారు. ఎచ్చెర్లలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో న్యాయవాదులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆమదాలవలసలో తెలుగు రైతులు నిరసన తెలిపారు. పాతపట్నం, నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, బగ్గు రమణమూర్తి, కాశీబుగ్గలో మాజీ మంత్రి గౌతు శివాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి.  

న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం)

పొందూరు: మండల పరిషత్‌ కార్యాలయం ముందు నేతల ఆందోళన

ఆమదాలవలస : ధాన్యం గాలిపోత పోస్తూ నిరసన తెలుపుతున్న కూన రవికుమార్‌

ఇచ్ఛాపురం: బాబుతో నేను అని రాసిన పోస్టుకార్డులతో నియోజకవర్గ నాయకులు 

లావేరు : జి.జి.వలసలో చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రపతికి పోస్టుకార్డులు రాసి నిరసన తెలుపుతున్న కలిశెట్టి, గ్రామస్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని