logo

కేసుల దర్యాప్తులో కచ్చితత్వం ఉండాలి: ఎస్పీ

కేసుల దర్యాప్తులో కచ్చితత్వం ఉండాలని, ఆ సమయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల సమన్వయంతో శిక్షల శాతం పెరిగేందుకు కృషి చేయాలని ఎస్పీ జి.ఆర్‌.రాధిక సిబ్బందికి సూచించారు.

Published : 24 Sep 2023 04:03 IST

శ్రీకాకుళం డీఎస్పీ శృతికి ప్రశంసాపత్రం అందజేస్తున్న ఎస్పీ రాధిక

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే:కేసుల దర్యాప్తులో కచ్చితత్వం ఉండాలని, ఆ సమయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల సమన్వయంతో శిక్షల శాతం పెరిగేందుకు కృషి చేయాలని ఎస్పీ జి.ఆర్‌.రాధిక సిబ్బందికి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, సిబ్బందితో శనివారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసుల దర్యాప్తులో సాక్షుల విచారణ, ఆధారాల సేకరణలో జాగ్రత్తలు పాటిస్తూ నిర్ణీత సమయంలో ఛార్జిషీట్‌ దాఖలు చేయాలన్నారు.  రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీలు వై.శృతి, నాగేశ్వరరెడ్డి, బాలచంద్రారెడ్డి, సీఐ పైడయ్య, ఎస్సైలు బాలరాజు, మధుసూదన్‌, కృష్ణవర్మ, విజయ్‌కుమార్‌, రాజేష్‌, లక్ష్మణరావు, కృష్ణ, మహిళా పోలీసులు రేవతి, సూర్యకుమారి, మర్యఖాతున్‌లకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు విఠలేశ్వర్‌, తిప్పేస్వామి, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మల్లేశ్వరరావు, అదనపు పీపీ కె.తిరుమలరావు, కె.శంకరరావు, శ్రీకాంత్‌, సీనియర్‌ ఏపీపీలు నాగభూషణం, సుశీల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని