logo

మాకొద్దు.. సీపీఎస్‌, జీపీఎస్‌

సీపీఎస్‌, జీపీఎస్‌లు వద్దని, వాటితో తమకు ఎలాంటి ఉపయోగం లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్పష్టం చేశారు.

Published : 24 Sep 2023 04:03 IST

శ్రీకాకుళం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఫ్యాప్టో ప్రతినిధులు

సీపీఎస్‌, జీపీఎస్‌లు వద్దని, వాటితో తమకు ఎలాంటి ఉపయోగం లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. ప్రభుత్వం పేరు మార్చి అంకెల గారడీ చేస్తోందని మండిపడ్డారు. గ్యారెంటీ పెన్షన్‌ స్కీం (జీపీఎస్‌)కు వ్యతిరేకంగా శ్రీకాకుళం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా సీపీఎస్‌ రద్దు చేయలేదు సరి కదా.. జీపీఎస్‌ పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. పాత పింఛను విధానం తప్ప మరేది ఆమోదించేది లేదని తేల్చి చెప్పారు. ఓపీఎస్‌ సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు. అనంతరం తహసీల్దారు ఎన్‌.వెంకటరావుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో ప్రతినిధులు ఎస్‌.కిశోర్‌కుమార్‌, చౌదరి రవీంద్ర, టి.చలపతిరావు, కె.రాజేశ్వరరావు, సీహెచ్‌.శ్రీనివాస్‌, కె.డేనియల్‌, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని