logo

కారు నుంచి మంటలు

శ్రీకాకుళం నగరంలోని డేఅండ్‌ నైట్‌ కూడలిలో శనివారం ఓ కారు నుంచి మంటలు వచ్చాయి.

Published : 24 Sep 2023 04:03 IST

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని డేఅండ్‌ నైట్‌ కూడలిలో శనివారం ఓ కారు నుంచి మంటలు వచ్చాయి. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన శరత్‌చంద్ర పట్నాయక్‌ శ్రీకాకుళం రాగానే క్లచ్‌ పట్టేయడంతో కారు ఆగిపోయింది. దీంతో శరత్‌చంద్ర కారు దిగి మెకానిక్‌ దగ్గరకు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు రేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. కారులోని తీగలు షార్టు సర్క్యూట్‌ కావడంతో టైర్లు, ఇంజిన్‌ భాగం కాలిపోయిందని, సుమారు రూ.4 లక్షలు నష్టం వాటిల్లిందని కేంద్ర అగ్నిమాపకాధికారి ఎం.వరప్రసాద్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని