logo

అపజయాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి

ప్రస్తుత పోటీ ప్రపంచంలో లక్ష్యం గొప్పగా ఉంటే విజయం తప్పక వరిస్తుందని కాలిఫోర్నియాకు చెందిన ఐటీ రంగ అంతర్జాతీయ సంస్థ ‘పాత్ర ఇండియా’ ఎండీ, ఏపీ ఐటీ అసోసియేషన్‌ అధ్యక్షురాలు ఎం.లక్ష్మి పేర్కొన్నారు.

Published : 24 Sep 2023 04:03 IST

ఎం.లక్ష్మిని సత్కరిస్తున్న గురజాడ విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు, తదితరులు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ప్రస్తుత పోటీ ప్రపంచంలో లక్ష్యం గొప్పగా ఉంటే విజయం తప్పక వరిస్తుందని కాలిఫోర్నియాకు చెందిన ఐటీ రంగ అంతర్జాతీయ సంస్థ ‘పాత్ర ఇండియా’ ఎండీ, ఏపీ ఐటీ అసోసియేషన్‌ అధ్యక్షురాలు ఎం.లక్ష్మి పేర్కొన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం మునసబుపేటలోని గాయత్రి కళాశాలలో శనివారం ఫ్రెషర్స్‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అపజయాల నుంచి పాఠాలను నేర్చుకోవాలని సూచించారు. అనంతరం విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు, తదితరులు ఆమెను సత్కరించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల సంచాలకులు సంయుక్త, కరస్పాండెంట్ అంబటి రంగారావు, ప్రిన్సిపల్‌ డా.పులఖండం శ్రీనివాసరావు, ఐక్యూఏసీ సమన్వయకర్త డా.మార్తాండ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని