logo

పాత పింఛను విధానం పునరుద్ధరించాలి

సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానం పునరుద్ధరించాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండు చేశారు.

Published : 24 Sep 2023 04:03 IST

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

సోంపేట, కాశీబుగ్గ, న్యూస్‌టుడే: సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానం పునరుద్ధరించాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండు చేశారు. సోంపేట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఫ్యాప్టో, ఏపీసీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బలవంతంగా జీపీఎస్‌ రుద్దే ప్రయత్నం చేయడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను మోసగించడమేనన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. ఆయా సంఘాల ప్రతినిధులు, సోంపేట, కంచిలి, కవిటి మండలాల ఉపాధ్యాయులు, సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

  •  రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దు అంటూ పలాస తహసీల్దార్‌ కార్యాలయం వద్ద శనివారం నినదించారు. అనంతరం తహసీల్దార్‌ మధుసూదన్‌కు వినతి పత్రం అందజేశారు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని