logo

Crime News: నగలు చోరీ చేసి.. శ్మశానంలో దాచిపెట్టి

వేలూర్‌ తోటపాళ్యం-కాట్పాడి రోడ్డులో ఉన్న జోస్‌ ఆలూక్కాస్‌ నగల దుకాణంలో గత 15వ తేదీన దుకాణం భవనానికి కన్నం వేసి సుమారు 15 కిలోల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటన అనంతరం దుండగులను పట్టుకోవడానికి

Updated : 21 Dec 2021 12:34 IST

స్వాధీనం చేసుకున్న నగలను సోమవారం వేలూరు

ఎస్పీ కార్యాలయంలో మీడియాకు చూపుతున్న పోలీసులు

వేలూర్‌, న్యూస్‌టుడే: వేలూర్‌ తోటపాళ్యం-కాట్పాడి రోడ్డులో ఉన్న జోస్‌ ఆలూక్కాస్‌ నగల దుకాణంలో గత 15వ తేదీన దుకాణం భవనానికి కన్నం వేసి సుమారు 15 కిలోల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటన అనంతరం దుండగులను పట్టుకోవడానికి డీఎస్పీ నేతృత్వంలో ఏర్పాటైన రెండు ప్రత్యేక బృందాలు అనేక ప్రాంతాల్లో గాలిపు చర్యలను ముమ్మరం చేశాయి. దుండగులు ముఖానికి మాస్కు ధరించి చోరీకి పాల్పడినందున దుండగులను పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఈ క్రమంలో గత శనివారం దుకాణంలో చోరీ చేసిన నగల్లో 5 కిలోల నగలను ఓ యువకుడు గాంధీ రోడ్డులో ఉన్న ఓ నగల దుకాణానికి బంగారాన్ని కరిగించడానికి తీసుకువెళ్లాడు. ఆ దుకాణ యజమాని సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరిపారు. దర్యాప్తులో అతను పల్లికొండ సమీప కుచ్చిపాళ్యానికి చెందిన ఠిక్కారామన్‌ (26) అని తెలిసింది. అతనిపై పలు పోలీసుస్టేషన్లలో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసి పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లి దర్యాప్తు జరిపారు. అప్పుడు అతను నగలను కుచ్చిపాళ్యం సమీపంలో ఉన్న ఉత్తర కావేరి నది ఒడ్డున ఉన్న శ్మశానంలో గుంత తవ్వి పూడ్చిపెట్టినట్లు చెప్పాడు. సోమవారం ఉదయం అతన్ని తీసుకుని అక్కడకు వెళ్లిన పోలీసులు అక్కడ పూడ్చిపెట్టిన 10 కిలోల నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి సహకరించిన 10 మందిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అరెస్టయిన ఠిక్కారామన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని