logo

తల్లి మృతదేహాన్ని శ్మశానం నుంచి తీసుకొచ్చిఇంట్లో దాచిన కుమారుడు

అంత్యక్రియలు చేసిన తర్వాత తల్లి మృతదేహాన్ని తీసుకొచ్చిన కుమారుడు ఇంట్లో దాచాడు. పోలీసుల కథనం మేరకు... పెరంబలూర్‌ జిల్లా పరవాయి గ్రామానికి చెందిన బాలమురుగన్‌ (38) తండ్రి చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి ముక్కాయి

Updated : 26 Dec 2021 10:12 IST

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే : అంత్యక్రియలు చేసిన తర్వాత తల్లి మృతదేహాన్ని తీసుకొచ్చిన కుమారుడు ఇంట్లో దాచాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు...పెరంబలూర్‌ జిల్లా పరవాయి గ్రామానికి చెందిన బాలమురుగన్‌ (38) తండ్రి చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి ముక్కాయి పెంచి పెద్దచేసింది. ఆ సమయంలో బాలమురుగన్‌కు కొంత మతిస్థిమితం కోల్పోయాడు. ఏ పనికి వెళ్లకుండా ఇంటికే పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలో 11 నెలల క్రితం తల్లి ముక్కాయి చనిపోయింది. ఇంకా మతిస్థిమితం కోల్పోయిన బాలమురుగన్‌ తరచూ శ్మశానం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. వర్షం పడుతున్నప్పుడు తల్లి ఫొటోతో ఉన్న బ్యానర్‌ని సమాధిపై కప్పేవాడు. చాలారోజులు సమాధిపైనే నిద్రించాడు.

ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం బంధువుల అమ్మాయి అతనికి ఆహారం ఇచ్చేందుకు ఇంటికి వెళ్లింది. అప్పుడు ఇంట్లో దుర్వాసన రావడంతో బాలమురుగన్‌ను అడిగింది. బయటకు వెళ్లమని అతడు అన్నాడు. దీంతో అనుమానం వచ్చి ఆమె ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పింది. అందరూ కలిసి ఇంట్లోకి వెళ్లి చూశారు. అక్కడ ముక్కాయి మృతదేహం ఉండడాన్ని గమనించి దిగ్భ్రాంతి చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పెరంబలూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వారు దర్యాప్తు చేపట్టారు. రోజూ కొద్దికొద్దిగా సమాధి తవ్వి తల్లి శవాన్ని చెత్తబండిలో పెట్టుకొని అర్ధరాత్రి సమయంలో బాలమురుగన్‌ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినట్లు గుర్తించారు. శవాన్ని ఖననం చేస్తే బాలమురుగన్‌ మళ్లీ తవ్వి తీసే అవకాశం ఉండడంతో దహనం చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని