logo

పెరోల్‌పై విడుదలైన రాజీవ్‌ హత్యకేసు దోషి నళిని

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని, 30 ఏళ్లకి పైగా వేలూర్‌ జైల్లో ఉన్నారు. రెండు నెలల క్రితం ఆమె తల్లి పద్మ తనకి అనారోగ్యంగా ఉందని, కుమార్తెకి పెరోల్‌ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 30 రోజుల పెరోల్‌ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

Updated : 28 Dec 2021 08:57 IST


జైలు నుంచి నళినిని తీసుకెళ్తున్న పోలీసులు

వేలూర్, న్యూస్‌టుడే: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని, 30 ఏళ్లకి పైగా వేలూర్‌ జైల్లో ఉన్నారు. రెండు నెలల క్రితం ఆమె తల్లి పద్మ తనకి అనారోగ్యంగా ఉందని, కుమార్తెకి పెరోల్‌ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 30 రోజుల పెరోల్‌ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కాట్పాడిలో ఉన్న వేలు అనే వ్యక్తి ఇంట్లో ఉండనున్నట్లు నళిని తరఫున కోర్టుకు తెలిపారు. ఇంటి భద్రతను పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిశీలించి అనుమతి ఇచ్చారు. సోమవారం నుంచి 30 రోజులు నళినికి పెరోల్‌ మంజూరు చేశారు. మహిళా జైలు నుంచి సోమవారం ఉదయం 10 గంటలకి ఆమె బయటకు వచ్చింది. ఆమెకు తల్లి పద్మ, తమ్ముడు భార్య, మురుగన్‌ బంధువు తెన్‌మోళి స్వాగతం పలికారు. నళిని ఇంటి నుంచి, ఆమెను ఊరుదాటి వెళ్లొద్దని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వైద్య అవసరాలకు బయటకు వెళ్లొచ్చని, ముందే అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మీడియాతో మాట్లాడకూడదని, ప్రతిరోజు కాట్పాడి పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేయాలనే నిబంధనలతో పెరోల్‌ ఇచ్చారు. ఆమె ఉంటున్న ఇంటి వద్ద డీఎస్పీ నేతృత్వంలోని 50 మంది పోలీసులు షిప్టువారీగా 24 గంటలు విధుల్లో ఉంటారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని