logo

Sunny Leone:సన్నీ లియోనీకార్యక్రమాలకు నిరసన సెగ

పుదుచ్చేరిలో ఆంగ్ల సంవత్సరాది వేడుకలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. పర్యాటకశాఖ తరఫున పాత పోర్టు ప్రాంగణంలో నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో భాగంగ నటి సన్ని లియోన్‌ బృందం నేతృత్వంలో కార్యక్రమాలు

Updated : 31 Dec 2021 09:43 IST


సన్నీ లియోన్‌ బ్యానరు చింపుతున్న దృశ్యం

చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో ఆంగ్ల సంవత్సరాది వేడుకలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. పర్యాటకశాఖ తరఫున పాత పోర్టు ప్రాంగణంలో నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా నటి సన్ని లియోనీ బృందం నేతృత్వంలో కార్యక్రమాలు ఉంటాయని ప్రకటించారు. దీనికి పుదుచ్చేరిలోని పలు సంఘాలు నిరసన తెలిపాయి. కార్యక్రమం జరగనున్న పాత పోర్టు ప్రాంగణం ఎదుట గురువారం తమిళర్‌ కళగం తరఫున ఆందోళన జరిగింది. వేదిక ప్రాంతంలోకి చొరబడి అక్కడ ఏర్పాటు చేసిన సన్ని లియోనీ బ్యానర్లను ధ్వంసం చేశారు. ఆ కార్యక్రమాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని