logo

కేంద్రంపై నిందలేయడమే డీఎంకే పని కాదు: శశికళ

కేంద్రప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తూ ఉండటం మాత్రమే డీఎంకే ప్రభుత్వం పనికాదని శశికళ అన్నారు. తన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా శివగంగై జిల్లాలోని పలు ఆలయాలకు వెళ్లి శశికళ దర్శించుకున్నారు. అందులో భాగంగా రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.

Published : 19 May 2022 04:56 IST

వేలునాచ్చియార్‌ విగ్రహానికి నివాళి అలర్పిస్తున్న శశికళ

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: కేంద్రప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తూ ఉండటం మాత్రమే డీఎంకే ప్రభుత్వం పనికాదని శశికళ అన్నారు. తన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా శివగంగై జిల్లాలోని పలు ఆలయాలకు వెళ్లి శశికళ దర్శించుకున్నారు. అందులో భాగంగా రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. పైయూర్‌ ప్రాంతంలో ఉన్న వేలునాచ్చియార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ...అన్నాడీఎంకేలో చేరడం ఖాయమన్నారు. తదుపరి ప్రభుత్వం ఆ పార్టీదేనని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రజలు కష్టంలో ఉన్నారని తెలిపారు. హామీల్లో ఒక్కటి కూడా కూడా నెరవేర్చలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జయలలిత కేంద్రంపై నిందలు వేయలేదని, ప్రజలకు కావాల్సిన వాటి గురించి అడిగి తెలుసుకొని చేసేవారని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు ఎలాంటి మంచి చేయాలనేదాని గురించి మాత్రమే ఆలోచించాలని తెలిపారు. కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేయడమే డీఎంకే పనికాదని పేర్కొన్నారు.

‘అత్యవసర వస్తువుల జాబితాలో పత్తిని చేర్చాలి’

చెన్నై, న్యూస్‌టుడే: అత్యవసర వస్తువుల జాబితాలో పత్తిని చేర్చాలని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో... తిరుప్పూర్‌ గార్మెంట్స్‌ రంగంలో ఏడాదికి రూ.50వేల కోట్ల ఎగుమతి, స్వదేశీ వ్యాపారం జరుగుతోందన్నారు. ఇక్కడ ఎక్కువగా ఉపయోగించే నూలు ధర పెరిగిందని తెలిపారు. తిరుప్పూర్ల్‌లో మాత్రమే 20వేలకుపైగా పరిశ్రమలు ఉన్నాయన్నారు. వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10లక్షల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. పత్తిని అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చి జౌళి పరిశ్రమను కాపాడేందుకు ముందుకు రావాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని