logo

వాటిని అన్నాడీఎంకే పాలనలో పట్టించుకోలేదు

గత డీఎంకే పాలనలో నిర్మించిన సమత్తువపురం ఇళ్లను లబ్దిదారులకు కేటాయించకుండా 10ఏళ్లపాటు అన్నాడీఎంకే పక్కన పడేసిందని మంత్రి పెరియకరుప్పన్‌ తెలిపారు. శివగంగై జిల్లా సింగంపునరి సమీపంలోని కోట్టైవెంగైపట్టిలో మాజీ సీఎం కరుణానిధి పెరియార్‌ సమత్తువపురం పథకాన్ని గత డీఎంకే పాలనలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు.

Published : 19 May 2022 04:56 IST

మంత్రి పెరియకరుప్పన్‌

పనులు పరిశీలిస్తున్న మంత్రి, అధికారులు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: గత డీఎంకే పాలనలో నిర్మించిన సమత్తువపురం ఇళ్లను లబ్దిదారులకు కేటాయించకుండా 10ఏళ్లపాటు అన్నాడీఎంకే పక్కన పడేసిందని మంత్రి పెరియకరుప్పన్‌ తెలిపారు. శివగంగై జిల్లా సింగంపునరి సమీపంలోని కోట్టైవెంగైపట్టిలో మాజీ సీఎం కరుణానిధి పెరియార్‌ సమత్తువపురం పథకాన్ని గత డీఎంకే పాలనలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. కానీ తర్వాత అన్నాడీఎంకే అధికారంలోకి రావడంతో 10 ఏళ్లపాటు వాటిని పక్కనపడేసింది. దీంతో ఆ ఇళ్లు పాతబడిపోయాయి. అందువలన ఆ ఇళ్లను తిరిగి పునరుద్ధరించి కొత్త ఇళ్లుగా లబ్దిదారులకు అందించే చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా కోట్టైవెంగైపట్టిలోని పెరియార్‌ సమత్తువపురాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెరియకరుప్పన్‌, కలెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ....2011లో అధికారం చేపట్టిన అన్నాడీఎంకే ఇళ్లను లబ్దిదారులకు అందించలేదని తెలిపారు. స్టాలిన్‌ సీఎం అయిన తర్వాత పెరియార్‌ పేరిట ఉన్నవాటన్నింటినీ పునరుద్ధరించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఏడాది 180 సమత్తువపురాలు పునరుద్ధరించేందుకు నిధులు కేటాయించారని చెప్పారు. తొలుత తిరువళ్లూర్‌, విళుపురం, కడలూర్‌, తిరుచ్చి, శివగంగై జిల్లాలలోని ఐదు సమత్తువపురాలు పునరుద్ధరించి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. విళుపురంలోని సమత్తువపురాన్ని గత నెలలో ప్రజలకు అందజేయడంతో మంచి ఆదరణ లభించిందన్నారు. మిగిలిన నాలుగు జిల్లాల్లో పనులు జరుగుతున్నాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని