logo

వైభవంగా ముగిసిన వసంతోత్సవాలు

కామాక్షి అమ్మవారి ఆలయంలో ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించిన వసంతోత్సవాలు మంగళవారం రాత్రి ముగిశాయి. వేసవి ఉక్కపోత నుంచి అమ్మ వారికి ఉపశమనం కల్గించే విధంగా ఏటా మూడు రోజుల పాటు వసంతోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ.

Published : 19 May 2022 04:56 IST

అలంకరణలో లక్ష్మి సరస్వతి సమేత కామాక్షి అమ్మవారు

కాంచీపురం, న్యూస్‌టుడే: కామాక్షి అమ్మవారి ఆలయంలో ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించిన వసంతోత్సవాలు మంగళవారం రాత్రి ముగిశాయి. వేసవి ఉక్కపోత నుంచి అమ్మ వారికి ఉపశమనం కల్గించే విధంగా ఏటా మూడు రోజుల పాటు వసంతోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాల్లో భాగంగా లక్ష్మి సరస్వతి సమేత కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేక ఆరాధనలు నిర్వహించి అమ్మవారిని అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఉన్న వసంత మంటపంలో పుష్పాభిషేకం నిర్వహించారు. వసంతోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తులను అలంకరించి ఆలయ పరిసరాల్లోని నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం వసంతమంటపానికి తీసుకువచ్చి దీపారాధన నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని