logo

అమ్మవారి విగ్రహం లభ్యం

తిరువళ్ళూరు సమీపంలోని ఆలయ గుంటలో మట్టి తవ్వుతుండగా పురాతన అమ్మవారి రాతి విగ్రహం బయల్పడింది. కలియనూరు గ్రామంలో ఉన్న కైలాసనాథ స్వామి ఆలయానికి చెందిన గుంటలో ఉపాధి హామీ పథకం కింద పూడికతీత పనులు జరుగుతున్నాయి. బుధవారం కార్మికులు మట్టి తవ్వుతుండగా అమ్మవారి రాతి విగ్రహం దొరికింది.

Published : 19 May 2022 04:56 IST

విగ్రహాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌, ఎస్సై

తిరువళ్ళూరు, న్యూస్‌టుడే: తిరువళ్ళూరు సమీపంలోని ఆలయ గుంటలో మట్టి తవ్వుతుండగా పురాతన అమ్మవారి రాతి విగ్రహం బయల్పడింది. కలియనూరు గ్రామంలో ఉన్న కైలాసనాథ స్వామి ఆలయానికి చెందిన గుంటలో ఉపాధి హామీ పథకం కింద పూడికతీత పనులు జరుగుతున్నాయి. బుధవారం కార్మికులు మట్టి తవ్వుతుండగా అమ్మవారి రాతి విగ్రహం దొరికింది. సమాచారం అందుకున్న తాలూకా ఎస్సై నటరాజన్‌, తిరువళ్ళూరు తహసీల్దార్‌ సెంథిల్‌ విగ్రహాన్ని పరిశీలించారు. కైలాసనాథ ఆలయ పూజారి విగ్రహానికి అభిషేకం చేసి పూజలు నిర్వహించి ఆలయంలో భద్రపరిచారు. త్వరలో విగ్రహాన్ని పురావస్తు పరిశోధనా కేంద్రానికి పంపుతామని తహసీల్దార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని