logo

దోషి విడుదలపై సంబరాలు రక్తకన్నీరు తెప్పిస్తున్నాయి

రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషిగా ఉన్న పేరరివాళన్‌ కోసం నిర్వహిస్తున్న సంబరాలు రక్తకన్నీరు తెప్పిస్తున్నాయని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్‌లో ఉన్న రాజీవ్‌ హత్యా స్థలిలో కాంగ్రెస్‌ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.

Published : 22 May 2022 08:04 IST

టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి

రాజీవ్‌గాంధీ హత్యాస్థలిలో నివాళులు అర్పిస్తున్న కేఎస్‌ అళగిరి తదితరులు

శ్రీపెరంబుదూర్‌, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషిగా ఉన్న పేరరివాళన్‌ కోసం నిర్వహిస్తున్న సంబరాలు రక్తకన్నీరు తెప్పిస్తున్నాయని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్‌లో ఉన్న రాజీవ్‌ హత్యా స్థలిలో కాంగ్రెస్‌ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. శుక్రవారం చెన్నైలో ప్రారంభించిన రాజీవ్‌ స్మారక జ్యోతి సద్భావన యాత్ర శనివారం శ్రీపెరంబుదూరుకు చేరుకోవడంతో అక్కడ అళగిరి, ఇతర నేతలు స్వాగతం పలికారు. తరువాత జ్యోతిని రాజీవ్‌ హత్యా స్థలిలో ఉంచి నివాళులు అర్పించి, ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కేఎస్‌ అళగిరి విలేక్లరతో మాట్లాడుతూ... పేరరివాళన్‌ను సుప్రీంకోర్టు విడుదల చేయడంపై డీఎంకే, అన్నాడీఎంకే, నామ్‌ తమిళర్‌ కట్చి సంబరాలు చేసుకోవడం వేదన కలిగిస్తోందని అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులకు రక్తకన్నీరు తెప్పిస్తోందని అన్నారు. రాజీవ్‌ హంతకులను విడుదల చేయడానికి అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించడానికి డీఎంకే భాగస్వామ్యం ఎక్కువగా ఉందన్నారు. మిగిలిన ఆరుగురి విడుదలకు చట్టరీత్యా అన్ని చర్యలు తీసుకొంటామని సీఎం స్టాలిన్‌ ప్రకటించారని గుర్తు చేశారు. పేరరివాళన్‌, ఆయన తల్లి అర్బుతమ్మాళ్‌లు డీఎంకే, అన్నాడీఎంకే, ఎండీఎంకే, నామ్‌ తమిళర్‌, కమ్యూనిస్టు పార్టీల నాయకులను కలవడం అసంతృప్తిగా ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు తంగబాలు, ఎస్‌ఎస్‌ తిరునావుక్కరసు, శ్రీపెరంబుదూర్‌ ఎమ్మెల్యే సెల్వ పెరుందగై తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని