logo

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్రంలోని పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని పాడిపరిశ్రమ శాఖ మంత్రి నాజర్‌ పేర్కొన్నారు. తిరువళ్ళూరు జిల్లా పూందమల్లి యూనియన్‌లో డీఆర్‌డీఏ పథకాల ప్రారంభ కార్యక్రమాలు శనివారం జరిగాయి.

Published : 22 May 2022 04:43 IST

మహిళలు తయారు చేస్తున్న నూలు సంచులను పరిశీలిస్తున్న మంత్రి నాజర్‌

 

తిరువళ్ళూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని పాడిపరిశ్రమ శాఖ మంత్రి నాజర్‌ పేర్కొన్నారు. తిరువళ్ళూరు జిల్లా పూందమల్లి యూనియన్‌లో డీఆర్‌డీఏ పథకాల ప్రారంభ కార్యక్రమాలు శనివారం జరిగాయి. కలెక్టర్‌ ఆల్పిజాన్‌వర్గీస్‌ ఆధ్వర్యంలో మంత్రి నాజర్‌ హాజరై నేమంలో రూ.37 లక్షలతో ఏర్పాటు చేసిన నూలు సంచుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కుత్తంబాక్కం పెరియార్‌ సమత్వపురంలోని పక్కా గృహాలకు రూ.5.08 కోట్లు వ్యయంతో మరమ్మతులు, ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి, డీఆర్‌డీఏ అధికారి జయకుమార్‌, గ్రామ పంచాయతీల డైరెక్టర్‌ సుధ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని