logo

వైభవంగా వరదరాజ పెరుమాల్‌ తీర్థవారి

వరదరాజ పెరుమాల్‌ బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన తీర్థవారి ఉత్సవాన్ని శనివారం ఆలయ ప్రాంగణంలో ఉన్న అనంత సరస్సు పుష్కరిణిలో వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయంలో వైఖాసి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13న ప్రారంభం కాగా శనివారం ముగిశాయి.

Published : 22 May 2022 04:43 IST

అనంత సరస్సులో మునుగుతున్న భక్తులు (అంతరచిత్రంలో) స్వామికి తీర్థవారి నిర్వహణ

కాంచీపురం, న్యూస్‌టుడే: వరదరాజ పెరుమాల్‌ బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన తీర్థవారి ఉత్సవాన్ని శనివారం ఆలయ ప్రాంగణంలో ఉన్న అనంత సరస్సు పుష్కరిణిలో వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయంలో వైఖాసి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13న ప్రారంభం కాగా శనివారం ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత వరదరాజ పెరుమాల్‌ వివిధ వాహనాలపై భక్తులను కటాక్షించారు. తీర్థవారి ఉత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. సెల్వర్‌ విగ్రహాన్ని అనంత సరస్సుకు ఊరేగింపుగా తీసుకు వచ్చిన అర్చకులు గోవిందనామ స్మరణతో పుష్కరిణిలో అభిషేకించారు. ఈ సందర్భంగా భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించారు. తీర్థవారి సందర్భంగా కొలను చుట్టూ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని