logo

ధర్మపురం ఆధీనంలో గురుపూజ

ధర్మపుర ఆధీనం గురుపూజ వేడుకల్లో 27వ గురుమహా సన్నిధానం పల్లకిలో వెళ్లి గురుమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. మైలాడుతురైలో 16 శతాబ్ధానికి చెందిన ధర్మపురం ఆధీనం మఠం ఉంది. ఈ మఠంలో ఏటా ఆదిగురు ముదలవర్‌ గురుజ్ఞాన సంబందరిన్‌

Published : 22 May 2022 04:43 IST

పల్లకిలో వెళ్తున్న 27వ గురుమహా సన్నిధానం

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ధర్మపుర ఆధీనం గురుపూజ వేడుకల్లో 27వ గురుమహా సన్నిధానం పల్లకిలో వెళ్లి గురుమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. మైలాడుతురైలో 16 శతాబ్ధానికి చెందిన ధర్మపురం ఆధీనం మఠం ఉంది. ఈ మఠంలో ఏటా ఆదిగురు ముదలవర్‌ గురుజ్ఞాన సంబందరిన్‌ గురుమూర్తిగల్‌ కమలై జ్ఞానప్రకాశర్‌ గురు పూజ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఈసందర్భంగా జ్ఞానపూరీశ్వరర్‌ ఆలయంలో వైకాశీ వేడుకలు 11 రోజులు జరుపుకొని పట్టణ ప్రవేశం వేడుకగా జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 12వ తేదీన ధ్వజారోహణతో వేడుకలు ప్రారంభం అయ్యాయి. వేడుకల్లో ముఖ్య కార్యక్రమాలైన తిరు కల్యాణం, రథోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం కమలై జ్ఞానప్రకాశర్‌ గురుపూజ వేడుక ప్రారరభం అయింది. మేళతాళాల మద్య ధర్మపురం ఆధీనం 27వ గురుమహా సన్నిధానం శ్రీలశ్రీ మాసిలామణి దేశిక జ్ఞానసంబంధ పరమాచార్య స్వామిగల్‌ మఠం నుంచి భక్తులు మోసుకెళ్లే పల్లకిలో కూర్చొని వెళ్లి గురుమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని