logo

వీడియో కాల్‌ కేసులో మురుగన్‌కు ఊరట

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మురుగన్‌ వేలూర్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి కారణంగా 2020లో జైలు ఖైదీలను కలిసేందుకు బయటివారికి నిషేధం విధించారు. వాట్సాప్‌ వీడియో కాల్‌ మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు.

Published : 25 May 2022 01:29 IST

మురుగన్‌ని కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్తున్న పోలీసులు

వేలూర్‌, న్యూస్‌టుడే: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మురుగన్‌ వేలూర్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి కారణంగా 2020లో జైలు ఖైదీలను కలిసేందుకు బయటివారికి నిషేధం విధించారు. వాట్సాప్‌ వీడియో కాల్‌ మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. మురుగన్‌ బంధువులతో వీడియో కాల్‌ మాట్లాడారు. జైలు నిబంధనలు మీరి విదేశాలకు వీడియో కాల్‌ మాట్లాడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ వేలూర్‌ కోర్టులో కొనసాగుతోంది. 19వ తేదీన తుది విచారణ ముగిసిన స్థితిలో న్యాయమూర్తి 24వ తేదీకి తీర్పు వాయిదా వేశారు. మంగళవారం పోలీసు భద్రత నడుమ మురుగన్‌ణు కోర్టులో హాజరుపరిచారు. మురుగన్‌పై ఆరోపణ రుజువు కాలేదని, ఈ కేసు నుంచి విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం అతనిని పోలీసులు జైలుకి తీసుకెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని