logo

అన్నా వర్సిటీలో ఆరుగురికి కరోనా

అన్నా విశ్వవిద్యాలయంలో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ నేరుగా వెళ్లి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మద్రాసు ఐఐటీలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థుల ద్వారా కొన్ని రోజుల క్రితం కొవిడ్‌ వ్యాప్తి ప్రారంభమైంది

Published : 25 May 2022 01:29 IST

వైద్యులతో చర్చిస్తున్న ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌

ప్యారిస్‌, న్యూస్‌టుడే: అన్నా విశ్వవిద్యాలయంలో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ నేరుగా వెళ్లి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మద్రాసు ఐఐటీలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థుల ద్వారా కొన్ని రోజుల క్రితం కొవిడ్‌ వ్యాప్తి ప్రారంభమైంది. అనంతరం ఐఐటీఎం ప్రాంగణంలో ఉన్న హాస్టల్‌, కార్యాలయాల్లో ఉన్న విద్యార్థులు, ఫ్రొఫెసర్లు, సిబ్బందికి పరీక్షలు చేయడంతో, 198 మందికి కరోనా నిర్ధారించారు. అందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో చెన్నై గిండిలో ఉన్న అన్నా వర్శిటీలో కొన్ని రోజుల ముందు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కొందరికి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో 40 మందికి పరీక్షలు చేయగా సోమవారం ఆరుగురికి కరోనా నిర్థారణ అయింది. వారికి సన్నిహితంగా ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకుగాను ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. కరోనా నిర్థారణ అయిన వారికి చికిత్స అందించడానికి అవసరమైన చర్యలను చేపట్టారు.

‘కొవిడ్‌ తక్కువగా ఉందని నిర్లక్ష్యం వద్దు’

ప్యారిస్‌, వేలచ్చేరి, న్యూస్‌టుడే: కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న జిల్లాల్లో అధికారులు నిర్లక్ష్యంగా ఉండకూడదని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ తెలిపారు. మంకీ ఫీవర్‌ వ్యాపిస్తున్న స్థితిలో రాష్ట్రంలో ఈ వ్యాధి ప్రబలితే చికిత్స అందించడంపై వైద్యులకు ఓమందూర్‌ ఆస్పత్రిలో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. దీన్ని రాధాకృష్ణను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.... చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో కరోనా ఉందన్నారు.

ఆందోళన అనవసరం

మంకీ ఫాక్స్‌ వ్యాధి గురించి ఆందోళన అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు. కన్యాకుమరి ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి మనో తంగరాజ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అది అంటు వ్యాధి కాదని డబ్ల్యుహెచ్‌ఓ తెలిపిందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు