logo

రైతులకు రాయితీపై ఉపరకరణాలు

నామక్కల్‌ జిల్లా పరమత్తివేలూర్‌ తాలూకా ప్రాంతీయ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ తరపున నిర్వహించిన ‘కలైంజ్ఞర్‌ అన్ని గ్రామాల ఉమ్మడి వ్యవసాయాభివృద్ధి పథకం’ కింద రైతులకు వ్యవసాయ శాఖ తరపున రాయితీతో కూడిన తాటి మొక్కలు, కూరగాయల విత్తనాలు, పైర్ల రకాలు, పండ్ల మొక్కలు,

Published : 25 May 2022 01:29 IST

వస్తువులు అందజేస్తున్న దృశ్యం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: నామక్కల్‌ జిల్లా పరమత్తివేలూర్‌ తాలూకా ప్రాంతీయ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ తరపున నిర్వహించిన ‘కలైంజ్ఞర్‌ అన్ని గ్రామాల ఉమ్మడి వ్యవసాయాభివృద్ధి పథకం’ కింద రైతులకు వ్యవసాయ శాఖ తరపున రాయితీతో కూడిన తాటి మొక్కలు, కూరగాయల విత్తనాలు, పైర్ల రకాలు, పండ్ల మొక్కలు, ప్లాస్టిక్‌ డ్రమ్ములు, పారంపర్య వ్యవసాయ ముడి వస్తువులతో బాటు వ్యవసాయానికి అవసరమైన పలు వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరమత్తివేలూర్‌ ప్రాంతీయ మేనేజ్‌మెంట్‌ సహాయ సంచాలకుడు గోవిందస్వామి, పరమత్తివేలూర్‌ పట్టణ పంచాయతీ అధ్యక్షుడు మణి, ఉద్యాన శాఖ అధికారులు, పశు సంరక్షణా శాఖ వైద్యులు, గ్రామ నిర్వాహక అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని