logo

వేడుకగా వీరరాఘవస్వామి తెప్పోత్సవాలు

తిరువళ్ళూరులోని వీరరాఘవస్వామి ఆలయ తెప్పోత్సవాలు కమనీయంగా సాగుతున్నాయి. ఆలయం సమీపంలోని హృదయ పాపవినాశిని పుష్కరిణిలో మంగళవారం నుంచి మూడు రోజుల ఆణిమాస తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో

Published : 30 Jun 2022 06:32 IST


తెప్పపై విహరిస్తున్న స్వామివారు

తిరువళ్ళూరు, న్యూస్‌టుడే: తిరువళ్ళూరులోని వీరరాఘవస్వామి ఆలయ తెప్పోత్సవాలు కమనీయంగా సాగుతున్నాయి. ఆలయం సమీపంలోని హృదయ పాపవినాశిని పుష్కరిణిలో మంగళవారం నుంచి మూడు రోజుల ఆణిమాస తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత వీరరాఘవస్వామికి ప్రత్యేక అభిషేకాలు, తిరుమంజన సేవ నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి తెప్పలపై కొలువుతీర్చి వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పుష్కరిణిలో మూడుమార్లు విహారం చేయించారు. పరిసరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి తెప్పోత్సవంలో పాల్గొని స్వామిని, అమ్మవార్లను సేవించి తరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని