logo

ఎక్కడ చూసినా ఎడప్పాడి సేవకులే

అన్నాడీఎంకే ప్రచారకర్తగా ఉన్న మరుదు అళగురాజ్‌ ఇటీవల నమదు అమ్మ పత్రిక ఎడిటర్‌ పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..

Updated : 05 Jul 2022 06:35 IST

మరుదు అళగురాజ్‌

సైదాపేట, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే ప్రచారకర్తగా ఉన్న మరుదు అళగురాజ్‌ ఇటీవల నమదు అమ్మ పత్రిక ఎడిటర్‌ పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఓపీఎస్‌, ఈపీఎస్‌లు పార్టీని విజయవంతంగా నడిపిస్తారనే నమ్మకం కోల్పోవడంతో నమదు అమ్మ ఎడిటర్‌ పదవి నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నారు. పార్టీ చీలిక మార్గంలో వెళ్లడానికి ఎవరు కారణమనేది తెలుసన్నారు. సర్వసభ్య సమావేశ తీర్మానాలు తయారుచేసే కమిటీలో తాను కూడా ఉన్నానని, వాటిని ఖరారు చేసి ఓపీఎస్‌, ఈపీఎస్‌లకు పంపామని అన్నారు. 23న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎక్కడ చూసినా పళనిస్వామి సేవకులను నిల్చోపెట్టారని పేర్కొన్నారు. పన్నీర్‌సెల్వం, ఆయన వర్గీయులు లోపలికి వచ్చేటప్పుడు నిర్వాహకులకు వెనుక కూర్చున్న కొందరు అసభ్యపదజాలంతో దూషించారని తెలిపారు. అరగంటలో సమావేశం ముగిసిందంటే అది ఎలా జరిగిందో తెలుస్తోందని పేర్కొన్నారు. కావాలనే ఓపీఎస్‌ను అవమానించారని అన్నారు. దీన్ని వేదికపై ఉన్న ఎడప్పాడి చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు. ఎప్పటికీ సర్వసభ్య సభ్యులు, కార్యవర్గ సభ్యులు ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేయటం కుదరదని, ఇది అన్నాడీఎంకేలో నిబంధన అని తెలిపారు. ప్రస్తుతం డబ్బుతో ఎంతమంది సర్వసభ్య సభ్యులనైనా కొనొచ్చని పేర్కొన్నారు. సమావేశంలో అన్ని తీర్మానాలు నిరాకరిస్తున్నట్లు చెప్పడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. అలాగైతే జయలలితకు భారతరత్న ఇవ్వాలని కోరిన తీర్మానం కూడా రద్దు అవుతుందా? అని ప్రశ్నించారు. కూవత్తూరులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే స్థోమత ఎడప్పాడి పళనిస్వామికి ఉండడంతో సెంగోట్టయ్యన్‌ ముఖ్యమంత్రి కాలేకపోయారని అన్నారు. అదే తరహాలో ఎడప్పాడి ప్రస్తుతం సర్వసభ్య సభ్యులను కూడా లోబర్చుకున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని