logo

రెండు రైల్వే స్టేషన్లలో బ్రెయిలీ లిపి మ్యాప్‌ సూచికలు

అంధుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో రూపొందించిన మ్యాపుల సూచికలను చెన్నై సెంట్రల్‌, ఎగ్మూరు స్టేషన్లలో ఏర్పాటు చేశారు. చెన్నై డివిజన్‌లో కార్పొరేట్‌ సోషియల్‌ రెస్పాన్సిబులిటీ (సీఎస్సార్‌) పథకంలో.....

Updated : 05 Jul 2022 06:35 IST

 

వడపళని, న్యూస్‌టుడే: అంధుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో రూపొందించిన మ్యాపుల సూచికలను చెన్నై సెంట్రల్‌, ఎగ్మూరు స్టేషన్లలో ఏర్పాటు చేశారు. చెన్నై డివిజన్‌లో కార్పొరేట్‌ సోషియల్‌ రెస్పాన్సిబులిటీ (సీఎస్సార్‌) పథకంలో భాగంగా రెనాల్ట్‌ నిస్సాన్‌, స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంకుల సహకారంతో వీటిని ఏర్పాటు చేసినట్టు దక్షిణ రైల్వే సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. టిక్కెట్టు కౌంటర్లు, నీళ్ల కొళాయిలు, మరుగుదొడ్లు, వేచి ఉండే గదులు వంటి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. బ్రెయిలీ లిపిలో క్యూఆర్‌ కోడ్‌ల సౌకర్యం కూడా కల్పించారు. స్మార్ట్‌ ఫోన్ల ద్వారా స్కాన్‌ చేసుకోవచ్చని, వారికి ఆడియో సందేశం అందుతుందని చెప్పారు. తాంబరం, చెంగల్పట్టు, అరక్కోణం, కాట్పాడి స్టేషన్లలో కూడా ఈ వసతి కల్పిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని