logo

రాష్ట్రవ్యాప్తంగా 21 చోట్ల సోదాలు

రాష్ట్రమంతటా ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌ అనే ప్రైవేటు సంస్థకు సంబంధించిన 21 ప్రదేశాలలో ఆర్థికనేరాల నియంత్రణ విభాగ పోలీసులు దాడులు చేశారు. వేలూం్  ప్రధాన కార్యాలయంగా ఈ సంస్థను వేదనారాయణ, లక్ష్మినారాయణ అనే సోదరులు నడుపుతున్నారు.

Published : 06 Aug 2022 00:40 IST

ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహణ

సత్తువచ్చారిలో ఉన్న ఐఎఫ్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం

వేలూరు, ట్రిప్లికేన్, కాంచీపురం, న్యూస్‌టుడే: రాష్ట్రమంతటా ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌ అనే ప్రైవేటు సంస్థకు సంబంధించిన 21 ప్రదేశాలలో ఆర్థికనేరాల నియంత్రణ విభాగ పోలీసులు దాడులు చేశారు. వేలూం్  ప్రధాన కార్యాలయంగా ఈ సంస్థను వేదనారాయణ, లక్ష్మినారాయణ అనే సోదరులు నడుపుతున్నారు. ఈ సంస్థలో రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.ఎనిమిది వేలు ఇస్తామని మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా దీనికి చెందిన 21 ప్రదేశాలలో శుక్రవారం ఈ దాడులు చేపట్టారు. చెన్నై, కాంచీపురం, వేలూం్, అరక్కోణం, నెమిలి తదితరచోట్ల ఇవి జరిగాయి. గిండిలో ఉన్న తామరై టెన్ పార్క్‌ భవనంలో నడుస్తున్న కార్యాలయం, మైలాపూం్, పోరూం్ తదితర నాలుగు ప్రదేశాలలో అధికారులు సోదాలు చేశారు. రూ.లక్ష చెల్లిస్తే నెలకు రూ.30 వేలు వంతున వడ్డీ ఇస్తామని ఆరుద్రఫైనాన్స్‌ సంస్థ మోసానికి పాల్పడినట్లు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. మే 24వ తేదీన ఆర్థికనేరాల నియంత్రణ విభాగ పోలీసులు ఆ సంస్థ, సంబంధిత 26 ప్రదేశాలలో ఆకస్మిక దాడులు చేశారు. లెక్కలోనికి రాని రూ.3.41 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. 81 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. దీనిపై ఆరుద్ర ఫైనాన్స్‌ సంస్థ డైరెక్టర్లు 14 మందిపై, ఆ పేరిట నడుస్తున్న ఐదు సంస్థలపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఐఎఫ్‌ఎస్‌ సంస్థపై కూడా అదే తరహా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో దీనిపై లోతైన దర్యాప్తునకు నగర పోలీసు కమిషనం్ శంకం్ జివాల్‌ ఆదేశించారు. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన ఈ సోదాల్లో భాగంగా సత్తువాచ్చారిలోని కార్యాలయానికి అధికారులు వెళ్లారు. దీంతో అక్కడి ఏజెంట్లు పారిపోయారు. కాట్పాడి ఆక్సీలియం కళాశాల రోడ్డు, వీజీరావ్‌ నగర్‌, నెమిలి తదితర కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. కాంచీపురంలోని సంస్థ స్థానిక డైరెక్టరు ఇంట్లో సోదాలు తర్వాత నివాసానికి సీలు వేశారు. సంస్థతో సంబంధం ఉన్న వారి ఇళ్లలోనూ దాడులు జరిపారు. పచ్చయప్పన్‌ మహిళా కళాశాల సమీపంలో ఉన్న మిన్మినీ శరవణన్‌ ఇంట్లో తనిఖీలు చేశారు.


  ‌ సోదాలు చేస్తున్న పోలీసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని