logo

దేశభక్తిపై సమావేశాలకు పెరిగిన స్పందన

స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా జార్జిటౌన్‌లోని శ్రీకన్యకా పరమేశ్వరి మహిళా కళాశాలకు చెందిన సృజన తెలుగు భాషా మండలి, మాడభూషి సాహిత్య కళాపరిషత్‌ సంయుక్తంగా ‘తెలుగు సాహిత్యం-దేశభక్తి’ అంశంపై అంతర్జాతీయ అంతర్జాల సదస్సును గురువారం నుంచి నిర్వహిస్తున్నాయి.

Published : 06 Aug 2022 00:40 IST

సమావేశాల్లో పాల్గొన్న సోమసుందరరావు, చక్రవర్తి, మునిరత్నం

చెన్నై(సాంస్కృతికం), న్యూస్‌టుడే: స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా జార్జిటౌన్‌లోని శ్రీకన్యకా పరమేశ్వరి మహిళా కళాశాలకు చెందిన సృజన తెలుగు భాషా మండలి, మాడభూషి సాహిత్య కళాపరిషత్‌ సంయుక్తంగా ‘తెలుగు సాహిత్యం-దేశభక్తి’ అంశంపై అంతర్జాతీయ అంతర్జాల సదస్సును గురువారం నుంచి నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఏర్పాటైన నాలుగు సమావేశాలలో రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 30 మంది పత్రాలు సమర్పించారు. మొదటి సమావేశానికి డాక్టర్‌ కొడాలి సోమసుందర్‌రావు (విశ్రాంత ఆచార్యులు, అక్కినేని నాగేశ్వరరావు కళాశాల, గుడివాడ), రెండో సమావేశానికి డాక్టర్‌ ఎం.మునిరత్నం (సర్‌ త్యాగరాయ కళాశాల తెలుగుశాఖ అధ్యక్షుడు), మూడో సమావేశానికి డాక్టర్‌ వేదాంతం రాజగోపాల చక్రవర్తి (విజయవాడ), నాలుగో సమావేశానికి ముద్దులూరి సురేష్‌ (డీఆర్‌బీసీసీ హిందూ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు) అధ్యక్షత వహించారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ముగింపు కార్యక్రమం జరగనుంది. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టి.మోహనశ్రీ అధ్యక్షత వహిస్తారు. అమెరికాకు చెందిన నంగూరి చిట్టెన్‌రాజు, కొండపల్లి నీహారిణి, శాంతి కూచిభట్ల అతిథులుగా పాల్గొంటారు. ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు సందేశం అందిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని