logo

‘అమ్మ మినీ క్లినిక్‌’లను మళ్లీ ప్రారంభించాలి

ప్రజల క్షేమం కోసం అమ్మ మినీ క్లినిక్‌ పథకాన్ని మళ్లీ అమలు చేయాలని అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో.... పేద, మధ్యతరగతి ప్రజలు తమ ఇళ్ల సమీపంలో చికిత్స పొందేలా ఈ పథకం ప్రారంభించినట్లు గుర్తుచేశారు.

Published : 08 Aug 2022 00:29 IST

ఎడప్పాడి డిమాండ్‌


 

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ప్రజల క్షేమం కోసం అమ్మ మినీ క్లినిక్‌ పథకాన్ని మళ్లీ అమలు చేయాలని అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో.... పేద, మధ్యతరగతి ప్రజలు తమ ఇళ్ల సమీపంలో చికిత్స పొందేలా ఈ పథకం ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ప్రజల నుంచి ఆదరణ పొందిందని, డీఎంకే ప్రభుత్వం రాజకీయ కక్ష కారణంగా ఈ పథకాన్ని నిలిపివేసిందన్నారు. మక్కలై తేడి మరుత్తువం అనే ఉపయోగం లేని పథకాన్ని పరిచయం చేసిందన్నారు. ఈ పథకం గురించి ప్రజలకు తెలియలేదని పేర్కొన్నారు. మొదటి రోజు మందులు ఇచ్చి వెళ్లిన వారు, ఇప్పటి వరకు మళ్లీ వచ్చి వివరాలు తెలుసుకోవడం లేదని ఆరోపించారు. తాము గతంలో అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు నిలిపివేసి ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. కరోనాకు మొదటి వేవ్‌ సమయంలో పలు ప్రైవేటు ఆస్పత్రులు పనిచేయని స్థితిలో, ఇప్పుడున్న అదే ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు చికిత్స అందించారని చెప్పారు. కానీ   ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజలు వెళ్లడానికి భయపడే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. పేరుకే మక్కలై తేడి మరుత్తువం పథకాన్ని ప్రకటించారని, ముఖ్యమంత్రితో ఫొటో షూట్‌ నిర్వహించి, ప్రజలను వైద్యం కోసం ఇబ్బంది పెట్టే ధోరణి మానుకోవాలని పేర్కొన్నారు. కక్ష సాధింపు రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల క్షేమం కోసం అమ్మ మినీ క్లీనిక్‌లను మళ్లీ ప్రారంభించాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని